Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 12:55 pm Posted by : ramakrishna

పెళ్లింట్లో చావు డప్పు

. తెల్లారితే పెళ్లి.. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం

. జగిత్యాల జిల్లా రాంచంద్రంపేటలో ఘటన

జగిత్యాల, బతుకమ్మ: బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో తెల్లారితే పెళ్లి.. ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లొచ్చిన పెళ్లి కొడుకు అందరితో కలివిడిగా మాట్లాడి తన రూములోకి వెళ్లి నిద్రించాడు. తెల్లవారుజామున లేచి చూసే సరికి తన రూములో ఫ్యాన్ కు ఉరేసుకొని విగతజీవిగా మారాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంచంద్రంపేటకు చెందిన లక్కంపెల్లి కిరణ్ ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం పెళ్లి కావాల్సి ఉండగా, కిరణ్ శుక్రవారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వచ్చాడు. రాత్రి అందరితో కలిసి ఉన్న ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున కిరణ్ ను నిద్రలేపేందుకు అతడి అక్క రూముకి వెళ్లగా అప్పటికే ఫ్యాన్  కు ఉరేసుకొని కనిపించాడు. మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కిరణ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.