సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డిని సన్మానించిన డీలర్లు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ సివిల్ సప్లయ్ డిస్ట్రిక్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డిని రేషన్ డీలర్లు సన్మానించారు. జిల్లా సివిల్ సప్లయ్ డీఎం కార్యాలయంలో శనివారం రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు నగేష్, గౌరవధ్యక్షులు గంగాకిషన్, ప్రధాన కార్యదర్శి పార్థసారథి,నగర కార్యదర్శి ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డిని సన్మానించి సత్కరించారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. రేషన్ డీలర్లకు ప్రభుత్వం తరపున రావాల్సిన కమిషన్ తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని...