. . . యాప్ ద్వారా ఎలాంటి లోటు పాటులు జరగకుండా చూడాలి
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాలలో గోదాములలో ఉన్న ఎరువు బస్తాలను డీసీఓ శ్రీనివాస్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ వివరాలను సీఈఓ శ్రీకాంత్ చైర్మన్ చింతల పల్లి గోవర్థన్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సక్రమంగా ఎరువులను సప్లై చేయాలని సూచించారు. గోదాములలో సరిపగా ఎరువులు ఉన్నపుడు రైతులకు ముందుగానే సమాచారం అందించాలన్నారు. దాంతో రైతులకు యాప్ లో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేసేటప్పుడు ఎలాంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలన్నారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడిన ఆయన సిబ్బంది పని తీరు బాగుందని, సక్రమంగా రైతులకు ఎరువులు అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి రోజు యాప్ లో స్టాక్ ని అప్ డేట్ చేస్తే రైతులకు రైతులకు సులువుగా ఉంటుదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీకాంత్, చైర్మన్ గోవర్థన్ రెడ్డి, మండే రవి సిబ్బంది పాల్గొన్నారు.
