Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 3:15 pm Posted by : ramakrishna

రికార్డులు తనిఖీ చేసిన డిసిఓ రామ్మోహన్

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం సొసైటీ కార్యాలయంలోని రికార్డులను జిల్లా సహకార అధికారి రామ్మోహన్ తనిఖీ చేశారు. గోదాములోని ఎరువుల వివరాలు సీఈఓ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, యూరియా, విత్తనాలు ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సురేష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లికిత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.