ట్రాలీ ఆటోను ఢీకొట్టిన డీసీఎం

భిక్కనూర్, బతుకమ్మ : హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోనుదాని వెనకాలే వస్తున్న డీసీఎం వ్యాన్ 44వ నంబర్ హైవేపై ఢీకొట్టింది. వంట పాత్రలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని రాజస్థాన్ దాబా వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ కు చెందిన మంగమ్మ, ఆమె కుమారుడు బన్నీ వంట పాత్రలు విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో శనివారం ఉదయం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామానికి చేరుకున్నారు....