Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 1:54 pm Posted by : ramakrishna

ట్రాలీ ఆటోను ఢీకొట్టిన డీసీఎం

భిక్కనూర్, బతుకమ్మ : హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోనుదాని వెనకాలే వస్తున్న డీసీఎం వ్యాన్ 44వ నంబర్ హైవేపై ఢీకొట్టింది. వంట పాత్రలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని రాజస్థాన్ దాబా వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

మెదక్ కు చెందిన మంగమ్మ, ఆమె కుమారుడు బన్నీ వంట పాత్రలు విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో శనివారం ఉదయం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వంట పాత్రలు విక్రయించుకొని భిక్కనూరు మండల కేంద్రానికి వస్తుండగా రాజస్థాన్ దాబా సమీపంలో వెనుకాల నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మిట్టపల్లి మంగమ్మ తలకు తీవ్ర గాయాలుకాగా, కుమారుడు మిట్టపల్లి బన్నీకి కాలు విరిగింది. తీవ్రంగా గాయాలు కాగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ లో ఎక్కించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి షిఫ్ట్ చెయ్యగా అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకొని స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

DCM hits trolley auto