నీటిని వదిలిన డిసిసిబి డైరెక్టర్

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి పెద్ద చెరువు నుండి ఆదివారం డిసిసిబి డైరెక్టర్ సిద్ధరాములు, మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులకు యాసంగి పంటలకు ఇబ్బంది కాకుండా నీరు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు శివలింగం బిజెపి గ్రామ అధ్యక్షులు నరేందర్ ప్రవీణ్ గ్రామ ప్రజలు ఉన్నారు.