బతుకమ్మ, ఏర్గట్ల : మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. తడపాకల్ తాళ్ల రాంపూర్ మాజీ ఎంపీటీసీ అడెం సవిత ఆరోగ్యం బాగా లేనందున, పరామర్శించడం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏర్గట్ల మాజీ సర్పంచ్ పిట్ల మీనా కుటుంబాన్ని, మునిమాణిక్యం సునీల్ పూణే లో అకస్మాత్తు బంగ్లా మీద నుండి పడి మరణించారు. వారి కుటుంబాన్ని, ఎస్.కె నవాబ్ రోడ్డు ప్రమాదంలో మరణించినందున వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజరెడ్డి, రొక్కెడ సంజీవ్, మునీర్, దొబ్బల మహేష్,రెండ్ల రాకేష్, దండవెన నందు,కూరాకుల బోర్రన్న, రొక్కేడ చిన్న సాయన్న, జుంగల సర్పంచ్ పాల్గొన్నారు.