దయా హృదయుడు దయానంద రెడ్డి
మెండోరా, బతుకమ్మ: చిట్టాపూర్ వాస్తవ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యావేత్త అయినా ఏనుగు దయానంద రెడ్డి దయా హృదయులని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గుంటూరు శోభ అన్నారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లోని జెడ్పిహెచ్ఎస్ (ఎస్సారెస్పీ) పాఠశాలకు మంగళవారం 15 డ్యూయల్ డెస్క్ లు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఫిజికల్ డైరెక్టర్ నరేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు దయానంద రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞత, అభినందనలు...