Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 6:21 pm Posted by : ramakrishna

భీంగల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా డేవిడ్ రాజ్ 

భీంగల్, బతుకమ్మ :

 

భీంగల్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా టి.డేవిడ్ రాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత పాలకవర్గం గడువు ముగిసినందున నూతన కార్యవర్గాన్ని మున్సిపల్ పరిధిలోని లివింగ్ క్రైస్ట్ చర్చ్ లో మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిక్క దేవదాస్ అద్యక్షతన జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షునిగా మలవత్ పరంజ్యోతి (దేవక్క పేట్), ఉపాధ్యక్షునిగా రిక్క దేవదాస్ (ముచ్కూర్), ప్రదాన కార్యదర్శిగా మాణిక్యాల ఏలియా, కోశాధికారిగా జేమ్స్, సంయుక్త కార్యదర్శిగా జాన్సన్, విజయ్, ప్రభు.కుమార్, సలహాదారులుగా ఇశ్రాయేలు, ప్రేమ్ కుమార్, షడ్రక్.అయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ టి.డేవిడ్ రాజ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుని ఐక్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దైవజనులు నోవా, సోలోమోన్, ప్రభుదాస్, జాన్సన్, ఏలియా, ప్రభుకుమార్, విజయ్, సోలోమోన్, బ్రదర్ యోన, జాషువా, జాకబ్, గాబ్రీయేల్, రవిందర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.