Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 1:00 pm Posted by : ramakrishna

మొగుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

. నిజామాబాద్ నాగారం లో ఘటన

.ఆలస్యంగా వెలుగులోకి..

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మొగుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది ఓ కూతురు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త, ఒక కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోగా, మరో కొడుకు వేరే చోటు ఉంటున్నాడు. కాగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి విజయ 300 క్వార్టర్స్ లో ఉంటోంది.

విజయను తన మొగుడితో కలిసి సౌందర్య గొంతు నులిమి హత్య చేసింది. ఆ తరువాత గుండెపోటు వచ్చి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే విజయ గొంతుపై గాయాలు ఉండడంతో స్థానికులు అనుమానంతో ఐదో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విజయ స్థానిక టిఫిన్ సెంటర్లలో పనిచేసేదని, డబ్బుల కోసమే ఆమెను కూతురు, అల్లుడు హత్య చేశారని తెలిసింది.