Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 12:56 pm Posted by : ramakrishna

పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య

వెబ్ న్యూస్, బతుకమ్మ: పిల్లలు పుట్టడం లేదని కోడలిని అత్తామామ అతిదారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా మలబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. రేణుక అనేక మహిళకు సంతోష్ హొనకాండే అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆ దంపతులకు సంతానం కలగకపోవడంతో అత్తామామలు కోడలితో తరచూ గొడవ పడుతున్నారు.  రేణుకను ఆమె మామ కామన్నా, జయశ్రీ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని గ్రామశివారులోకి తీసుకెళ్లారు. అక్కడ బండరాయితో తలపై కొట్టి చీరతో ఉరేసి హత్య చేశారు. బైక్ టైర్ లో చీరు చిక్కుకోవడంతో ప్రమాదం జరిగి రేణుక మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశారు. రేణు హత్యలో ఆమె భర్త సంతోష్ పాత్ర కూడా ఉందని పోలీసు విచారణలో తేలింది. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.