తల్లిని కోల్పోయిన క్షణాల్లోనే కూతురు మృతి
. . . చిట్యాల గ్రామంలో విషాద ఛాయలు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన నరసవ్వ (70) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న ఆమె కుమార్తె, ధర్మారావుపేట గ్రామానికి చెందిన బాలమణి (40), వెంటనే...