Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 4:57 pm Posted by : ramakrishna

ప్రముఖ దత్తక్షేత్రం గానుగాపూర్ కు బయలుదేరిన దత్త స్వాములు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కర్ణాటక రాష్ట్రం గల గుల్బర్గా జిల్లాలోని ప్రముఖ దత్త క్షేత్రం గానుగాపూర్ కు మంగళవారం దత్త స్వామి భక్తులు మాల ధారణ స్వాములు  భక్తజన బృందంతో బయల్దేరి వెళ్లారు. సద్గురు ధర్మం ధార్మిక సంస్థ వ్యవస్థాపక చైర్మన్, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు స్వామీజీ ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ యాత్రలో తెలంగాణ, కర్ణాటక పరిధిలో ఉన్న ప్రముఖ దైవ క్షేత్రాలు జర సంఘ్, కర్ణాటక రే చింతల్ గణపతి ఆలయం, బీదర్ నరసింహస్వామి ఆలయం, హుమ్నాబాద్ లోనిమాణిక్ ప్రభు మఠం తో పాటు గంగాపూర్ దత్తక్షేత్రం లో దర్శనం చేసుకుని కుంసిలో ఉన్న దైవ క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకుని తిరిగి రానున్నట్లు హరిదాస్ స్వామీజీ తెలిపారు.

Datta Swamulu left for Ganugapur, the famous Dattakshetra