Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 5:36 pm Posted by : ramakrishna

హైందవ సంస్కృతిలో దత్త జయంతికి ప్రత్యేక స్థానం

  • మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హైందవ సంస్కృతిలో దత్త జయంతికి ప్రత్యేక స్థానం ఉందని అందుకే దేశవ్యాప్తంగా ఈ జయంతిని హిందువులంతా ఏకతాటిపై నిలిచి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం దత్త పౌర్ణమి జయంతిని పురస్కరించుకొని నగరంలోని వినాయక్ నగర్ సద్గురు దామము ధార్మిక సేవా సంస్థ దత్తాత్రేయ ని ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, శాశ్వత చైర్మన్ ఇప్పకాయల హరిదాసు స్వామీజీ ఆధ్వర్యంలో దత్త జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకు గోపూజ, గౌరీ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రుత్విక్ వర్ణం, మండపారాధన, కలసస్థాపన లతో ప్రారంభమై అభిషేకం, దత్త యజ్ఞము, కుంకుమార్చన, డోలారోహణం,  మహా అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురుని యొక్క ప్రాధాన్యత, చెడు సంస్కృతిని పాలద్రోలాడానికి ఆ దత్తాత్రేయుడు మానవ అవతారంలో త్రిమూర్తి స్వరూపుడిగా ఎంతోమంది ని ఉద్ధరించారని ఆయన అన్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని కుటుంబ వ్యవస్థను  ఆ పరమశివుడు ద్వారా మనము నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సంతాన పలం కోసం హరిదాస్ స్వామీజీ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక తెలంగాణ కన్వీనర్ అప్పల ప్రసాద్ కార్పొరేటర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Datta Jayanti holds a special place in Hindu culture