. . . జమ్మూలో యాత్ర ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్
వెబ్ డెస్క్, బతుకమ్మ:
జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ అమర్ నాథ్ మంచు శివ లింగం దర్శనం శుక్రవారం ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు జరగనున్న అమర్ నాథ్ యాత్ర కు జమ్మూ నుంచి బయలు దేరిన ఫస్ట్ బ్యాచ్ యాత్రికుల పర్యటనను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జండా ఊపి ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఉదయం నుంచే చందన్ వాడి, పహల్గాం, బల్తాల్ క్యాంప్ లకు చేరుకుంటున్న భక్తులు. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 4 లక్షల మంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. జమ్మూ రాజధాని నుంచి 141 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కాశ్మీర్ లోయల్లో 3,888 మీటర్ల ఎత్తులో హిమ లింగం ధర్శనం ఆగస్టు 28 వరకు జరుగుతుంది. కాశ్మీర్ లోయలో యాత్రికుల కోసం వందలాది లంగర్లు ఏర్పాటు చేశారు.కాశ్మీర్ లోయలో 400 ఎఐ సీసీ కెమెరాలతో సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సారి వర్షకాలంలో భారీ వర్షాల వలన ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు.
