తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు
కాంగ్రెస్ అవినీతి, బీజేపీది దుర్నీతికి ప్రయోగశాలగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ నుంచి తరిమికొడదాం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపి పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన స్వర్ణ యుగం కాంగ్రెస్ రాబంధుల పాలవుతుందని ఎవరూ ఊహించ లేదని...