హైదరాబాద్, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసే అవకాశం ఉంది. స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవిషయమై ఏఐసీసీ పెద్దలలతో దానం సంప్రదింపులు జరిపారు. ఈనెల 23లోగా పార్టీ ఫిరాయింపు సమాధానాలను అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.