భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని విల్లెజ్ డెవలప్మెంట్ కమిటీ భవనంలో మంగళవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రజలకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ సదస్సు లోభాగంగా పోస్ట్ ఆఫీస్ లో ని పథకాలు(ఎస్ బి,ఆర్ డి,ఎస్. ఎస్. ఏ, టీ డి, పీ. పీ. ఎఫ్,ఎం.ఐ. ఎస్, ఎస్ సీ ఎస్ ఎస్) తో పాటు గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమాగురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. పోస్ట్ ఆఫీస్ లో స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ మొదలుకొని ఇన్సురెన్సు, సుకన్య సమృద్ధి అకౌంట్, ప్రజా భవిష్య నిధి ఖాతా, ఆధార్ ద్వారా చెల్లింపులు, ప్రమాద బీమా పథకాలు ఇలా అన్నీ సౌకర్యలను గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వి. డి. సి అధ్యక్షులు రవి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ విల్సన్ , ఉపాధ్యాయులు ఈశ్వర్ , మెప్మా అధ్యక్షురాలు జలజ, సబ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్, వీడీసీ క్యాషియర్ కుమ్మరి హరీష్ .మెయిల్ ఓవర్సీస్ చంద్రశేఖర్, తపాల సిబ్బంది, పట్టణ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.