Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 6:59 pm Posted by : ramakrishna

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

 

వేల్పూర్, బతుకమ్మ : 

మండలంలోని రామన్నపేట గ్రామంలో సోమవారం ఓ ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకొంది. స్థానిక ఉపాధి కూలీలు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డం భగవాన్ దాస్ (52) అనే వ్యక్తి రోజు వారిగా ఉపాధికూలికి వెళ్లే క్రమంలో ఉదయం 7 గంటలకే పనికి వెళ్ళాడు. గ్రామంలోని మల్లె చెరువులో ఫిష్ పాండ్ పనులు నడుస్తుండగా అక్కడ పని చేసే క్రమంలో తనకు తింపినట్లు, తిరిగినట్లు అవుతుందని అక్కడ ఉన్న కూలీలకు చెప్పి అక్కడే పడిపోయాడు. విషయాన్నీ ఫీల్డ్ అసిస్టెంట్ కు తెలపగా వెంటనే అంబులెన్సు తెప్పించి ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. భగవాన్ దాస్ ను పరీక్షించిన డాక్టర్ అప్పటికే ఆయన మరణించడాని ధ్రువీకరించినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ తెలిపారు. విషయాన్నీ తెల్సుకొన్న సర్పంచ్ నవీన్ సంఘటన స్థలానికి వెళ్లారు.

Daily wage laborer dies of a heart attack