Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 7:25 pm Posted by : ramakrishna

ఏకచక్ర అయ్యప్ప ఆలయంలో నిత్య భిక్షా కార్యక్రమం ప్రారంభం

బతుకమ్మ, బోధన్: బోధన్ ఏకచక్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు నిత్య భిక్షా కార్యక్రమాన్ని ఎసిపి శ్రీనివాస్ బోధన్ తాసిల్దార్ విటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో అన్నదాన సేవను మరింత వ్యవస్థీకృతంగా కొనసాగించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ స్వాములకు అవసరమైన భిక్షా ఏర్పాట్లను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, పావులూరు వెంకటేశ్వరరావు, మాటూరి ప్రసాద్, చల్లా శ్రీనివాసరావు, రమేష్, బ్రహ్మయ్య గౌడ్ సోదరులు చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నిత్య భిక్షా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమై జనవరి 5వ తేదీ వరకు ప్రతిరోజూ కొనసాగనున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భక్తులు ఈ దైవ సేవలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని, దాతలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Daily alms program begins at Ekachakra Ayyappa Temple