నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ”డాడీస్ రోడ్ యాప్’ స్టిక్కర్ ను బుధవారం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటిసి దుర్గా ప్రమీల మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు. ఇటువంటి యాప్ తయారు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలు అనుకోని ప్రమాదాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ ఆప్ క్యూఆర్ స్టిక్కర్ ను వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు అనంతరం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వాహనాలలు నడిపే ప్రతి ఒక్కరికి డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. వాహనాలకు “డాడీస్ రోడ్ ఆప్” క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడటమే “డాడీస్ రోడ్ యాప్” ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసిన అలర్ట్ మెసేజ్ వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్ రాహుల్ కుమార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ,ఏవో ప్రహ్లాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
