తీరాన్ని తాకిన ’మొంథా‘ తుపాను
వెబ్ న్యూస్,బతుకమ్మ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందు మూడు నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి.