బస్వాపూర్ లో సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

  జుక్కల్, బతుకమ్మ   జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జుక్కల్ ఎస్సై బి. మురళీ ఆధ్వర్యంలో పోలీసు బృందం సైబర్ నేరాల గురించి గ్రామ సర్పంచ్ తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ గ్రామాలలో మొబైల్ ఫోన్ లలో లింకులు ఓపేన్ చేయడం వలన సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నెంబర్లు, పిన్ నెంబర్లు, ఆధార్ పంపించాలని అడిగితే వివరాలు చెప్పొద్దని సూచించారు....