సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
కామారెడ్డి, బతుకమ్మ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజంపేట శాఖలో గురువారం సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎం.రాజేష్ చంద్ర, కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, రాజంపేట సబ్-ఇన్‌స్పెక్టర్ బి. మహేష్ సూచనలతో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సైబర్ మోసాలకు గురికాకుండా...