రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
రోజురోజుకి పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు ఆన్‌లైన్ బిజినెస్ పేరిట ఒకరు వ్యాపారం పేరుతో మరొకరు కరెంట్ బిల్లుల పేరుతో ఇంకొకరు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న వైనం సైబర్ నేరగాళ్ల వలలో సామాన్యులు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో రోజురోజుకి ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్‌లైన్‌లో వచ్చే బిజినెస్ యాప్‌లను నమ్ముకుంటూ వాటి ద్వారా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు కొందరు.మరికొందరు ల్యాటరీ తగిలిందని...