ఘనంగా సైబర్ జాగ్రూకత దివస్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, మేఘనా డెంటల్ కళాశాలలో వైద్యులు, అధ్యాపకులు, ఇంటర్న్‌లు, వైద్య విద్యార్థుల కోసం "సైబర్ జాగ్రూకత దివస్" పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో సమాజ ఆరోగ్య పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న వైద్యులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి, జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు...