డిల్లీ, బతుకమ్మ : డిల్లీలోని ఇందిరాభవన్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇటీవల మృతి చెందిన సీనియర్ నేతలు శివరాజ్ పాటిల్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌లకు సీడబ్ల్యూసీ సంతాపం ప్రకటించింది.
