Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 12:26 pm Posted by : ramakrishna

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సి వి ఆనంద్

 హైదరాబాద్, బతుకమ్మ:

 తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆప్ పోలిస్  గా సి వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐపిఎస్ క్యాడర్ కు చెందిన సివి ఆనంధ్ ఇటివల కోత్త డిజిపిగా నియమించిన విషయం తెోలిసిందే. డిజిపిగా ఉన్న శివధర్ రెడ్డి గురువారం పధవి విరమణ చేయగా శుక్రవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో సి వి ఆనంద్ అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టిన సి వి. ఆనంద్ కు అధికారులు పుష్ప గుచ్చం అందచేసి స్వాగతం పలికారు. మరికొందరు డీజీపీ స్థాయి ఇతర అధికారులు సి వి ఆనంద్ కు శుభాకాంక్షలు తెలిపారు. సి వి ఆనంద్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తామని సి వి ఆనంద్ పేర్కోన్నారు.

CV Anand takes charge as DGP