Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 11:41 am Posted by : ramakrishna

కలెక్టరేట్ కు కరెంట్ కష్టాలు

. ఉదయం 11.17 నిమిషాల వరకు నిలిచిన సరఫరా

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్రమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కరెంట్ కష్టాలను ఎదుర్కొంది. శుక్రవారం ఉదయం నుంచి 11.17 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు, సిబ్బంది ఏం చేయాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. స్థానికంగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మొత్తం 52శాఖల్లో రోజువారి పనులు ప్రారంభం కాలేదు. కేవలం కలెక్టర్, ఏవోతోపాటు మరో రెండు మూడు సెక్షన్ లకు మాత్రమే జనరేటర్ సౌకర్యం ఉండగా, మిగతా వారంతా కరెంట్  ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు.