Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 12:04 pm Posted by : ramakrishna

పర్యావరణ నష్టం పూడ్చకపోతే.. జైలుకు సీఎస్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

డిల్లీ,బతుకమ్మ:  కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈపిటిషన్ గురువారం విచారణకు రావడంతో  పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్ తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని పేర్కొంది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూములు చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా చెప్పాలని ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని అడిగింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది.