యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలను ఈవో వెంకట్రావు పరిశీలించారు.