రోడ్డు ప్రమాదాలపై క్రాస్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజల రక్షణ ,రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో క్రాస్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. సేవ్ లైప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం. ప్రతి ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను...