Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 5:58 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదాలపై క్రాస్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజల రక్షణ ,రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో క్రాస్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు.  సేవ్ లైప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం. ప్రతి ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది అని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమర్ధంగా ఉపయోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా  జిల్లా పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందించి రోడ్డు ప్రమాదాల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఈ శిక్షణతో రోడ్డు భద్రత మెరుగవడం, బాధితులకు న్యాయం కలగడం, భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఉపయోగపడే సమాచారం సేకరణ సాధ్యమవుతుంది అని అన్నారు. ఈ శిక్షణ సమయంలో నేర్చుకున్న ప్రతీ విషయాలను పోలీస్ స్టేషన్ లోని ప్రతీ సిబ్బంది కి తెలియజేయాలని తెలిపారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్  అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వరెడ్డి, ట్రాఫిక్ ఏ.సి.పి మస్తాన్ అలీ, ఈధర్ మేనేజర్ వర్షా నిహాంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్  కాటేగర్, సి.టి.సి సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరాం, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ ఓలు , ఐ.టి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cross-investigation into road accidents is mandatory