Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 7:32 pm Posted by : ramakrishna

మార్కెట్ లో అధిక ధర లభించే పంటలను సాగు చేయాలి

 

. . . రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

అందరు ఒకే రకమైన పంటలను పండించి నష్టపోకుండా, డిమాండ్ ఉండి మార్కెట్ లో అధిక ధర లభించే పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాల్వంచ మర్రి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు విధానంపై జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఎకరాకు 57 మొక్కలు నాటవచ్చని, ఈ మొక్కలను ఒక్కసారి నాటేతే 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్ళు దిగుబడి రాకపోయినా అంతర పంటలు వేసుకోని ఆధాయం సమకూర్చుకోవచ్చని తెలిపారు.

 

Crops that fetch high prices in the market should be cultivated.

ఆయిల్ పామ్ నమ్మకమైన దిగుబడిని ఇచ్చే పంట అని, ప్రస్తుతం టన్ను రూ. 22,000 రైతుకు అందుతుందని అన్నారు. ఏడాదికి ఎకరాకు 15 నుండి 17 టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. అలాగే కూలీల అవసరం పెద్దగా ఉండదని, కోతులు, చీడపీడల బెడద కూడా ఉండదని, తుఫాన్లు,వడగళ్ళ వానలకు నష్టపోదని, మార్కెట్ కు డొకా లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

 

Crops that fetch high prices in the market should be cultivated.