తక్కువ వర్షపాతానికి అనుకూల పంటలు సాగు చేయాలి
. . . వ్యవసాయ అధికారి వీర స్వామి మోర్తాడ్, బతుకమ్మ: రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణను చేపట్టాలని వ్యవసాయ అధికారి వీర స్వామి కోరారు. మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ గ్రామ రైతు వేదికలో గురువారం రైతులకు పంటల వైవిధ్యీకరణ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి...