యాసంగికి విరివిగా పంట రుణాలు పంపిణీ చేయాలి
జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ నిజామబాద్, బతుకమ్మ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రత్యేకించి ప్రస్తుత యాసంగి సీజన్లో పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. 2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు,...