పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలి
మళ్ళీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చెరువులు, కుంటాలను అధికారులు పర్యవేక్షించాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ - గత నాలుగైదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల దరిమిలా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకుగాను గురువారం నియోజకవర్గ పర్యటన అనంతరం ఎమ్మెల్యే బాల్కొండ క్యాంప్ ఆఫీస్...