Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 9:27 pm Posted by : ramakrishna

అక్రమ చెట్ల నరికివేత కేసులో నేరస్తుడికి 14 రోజుల రిమాండ్

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాయిలు అక్రమ చెట్ల నరికివేత కేసులో నిందితుడికి రిమాండ్ కు తరలించినట్లు డీ ఆర్ ఓ శ్రీనివాస్ తెలిపారు. చెట్లు నరికిన వ్యక్తిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా ఆయనను 14 రోజుల న్యాయ పరిరక్షణ కస్టడీకి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్, డీఆర్ఓ, బాస్కర్, ఎఫ్ఎస్ఓ, శేఖర్ రెడ్డి, ఎఫ్ బిఓ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ ఎస్.రమేష్ మాట్లాడుతూ, లింగంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో చెట్లను అక్రమంగా నరికివేయడం శిక్షార్హమైన నేరమని, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని న్యాయ పరిరక్షణ కస్టడీకి పంపబడతారని వెల్లడించారు.