ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోళ్ళు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి సోమవారం...