విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకొని విద్యాసంస్థల నిర్వాహకుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని గల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు తమ చేతిలోనికి తీసుకోని స్కూల్స్, కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టించడం జరుగుతుందని,...