. . . కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి
భిక్కనూరు, బతుకమ్మ :
పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్జే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో దాడి చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు 10 గ్రామాల గుండ్లను ఎత్తుకుని పారిపోయాడు.. కేసు నమోదు చేసుకుని భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై ఆంజనేయులు కేవలం మూడు గంటల్లోనే కేసును ఛేదించి నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, అతడు ఉపయోగించిన రోకలి మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మూడు గంటల్లోనే కేసు చేదించిన భిక్కనూర్ సిఐ, ఎస్ఐలను సిబ్బందిని ఆమె అభినందించారు.