Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:18 pm Posted by : ramakrishna

హత్యాయత్నం క్రిమినల్ అప్పీలు కొట్టివేత, ఐదేళ్ల జైలుశిక్ష ఖరారు

 

. . . ముగ్గురు ముద్దాయిలకు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష విధించిన నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు

 

. . . తీర్పును కొట్టివేయాలని సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

హత్యయత్నం కేసులో దోషులుగా నిర్దారణ అయిన ముగ్గురు అప్పీలుదారుల క్రిమినల్ అప్పీలును కొట్టివేస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత శుక్రవారం తీర్పు చెప్పారు. సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి కోర్టు వెలువరించిన పదకొండు పేజీలు అప్పీలు తీర్పులోని వివరాలు తెలిపారు. నిజామాబాద్ నగరం లోని హస్మి కాలనీకి చెందిన షేక్ నజీర్, సయ్యద్ అబ్దుల్ రిజ్వన్, సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ ఎదురు ఎదురు ఇళ్లవారు. సయ్యద్ అబ్దుల్ రిజ్వన్ తరచుగా తన ఇంటిపై నిలబడి షేక్ నజీర్ ఇంటిదిక్కు చూసేవాడు ఇలా చూడటం వలన తమ ఇళ్లలోని ఆడవారికి ఇబ్బందిగా ఉన్నదని చెప్పాడు. ఇలా అనడంతో నజీర్ తో గొడవపడి.. “నీవేందిరా.. నాకు చెప్పేది. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నీవు ఏమి చెసుకుంటావో చేసుకో అంటు, నీ అంతు చూస్తానంటూ బెదిరించా డు”. ఈ విషయంలో స్థానిక కార్పొరేటర్ ముఖీమ్ పంచాయతీ జరిగి రాజీ చేశారు. అయిన రిజ్వన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యాదావిదిగా అలాగే ప్రవర్తించడంతో 29 జూన్, 2020 న మధ్యాహ్నం గొడవపడి నజీర్ ను బయటకు రా.. రా అనడంతో అతని తమ్ముడు షేక్ అబ్దుల్ తాలిబ్ బయకు రావడంతో అతనిని నెట్టివేయగా నజీర్ బయటకు రావడంతో అతనిని సయ్యద్ అబ్దుల్ రిజ్వన్ అతని తమ్ముడు అబ్దుల్ రెహ్మాన్ వాళ్ళ స్నేహితుడు మహమ్మద్ అజార్ లు గల్లపట్టి, చేతులతో కొట్టారు. రిజ్వన్ తనవద్ద ఉన్న చాకుతో నజీర్ కుడివైవు కడుపులో పొడిచి హత్యాయత్నం చేశారు. అతనికి రెహ్మాన్, అజార్ లు సంహకరించారనే హత్యాయత్నం నేరారోపణలు నిర్దారణ అయినట్లు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు 31 మార్చి, 2026 తీర్పు చెప్పింది. తీర్పును దోషులు అయిన రిజ్వన్, రెహ్మాన్, అజార్ లు జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేశారు.వారి అప్పీలును స్వీకరించిన కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు, దోషుల తరపున న్యాయవాది వాదనలు విన్నది.దిగువ కోర్టు చెప్పిన తీర్పును సమర్దిస్తూ అప్పీలును కొట్టివేసింది. ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేస్తు సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు చెప్పారు.