Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 9:09 pm Posted by : ramakrishna

సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ

కోటగిరి, బతుకమ్మ : సీసీ కెమెరాలు ఏర్పటు చేసుకోవడం వల్ల నేరాలను నియంత్రించవచ్చని కోటగిరి ఎస్ఐ తెలిపారు. కోటగిరి మండలంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు  చేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షులు అంజయ్య, కార్యదర్శులు లక్ష్మణ్, దిలీప్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Crime Control by CCTV Cameras