Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 10:38 am Posted by : ramakrishna

ఆరు జట్లతో పోటీ… 2028 ఒలింపిక్స్ లో క్రికెట్

వెబ్ న్యూస్, బతుకమ్మ : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 2028లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో టీ20 క్రికెట్ పోటీలను ప్రారంభించనున్నారు. ఇందులో ఆరుజట్లు పోటీలో పాల్గొంటాయని నిర్వాహకులు గురువారం అధికారికంగా ప్రకటించారు. మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఒక్కో జట్టులో 15 మంది ఉంటారని పేర్కొన్నారు. మహిళలకు ఆరు జట్లు ఉంటాయని వివరించారు. 1900 సంవత్సరంలో పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో చివరగా క్రికెట్ ను ఆడారు.