పోలీస్ శాఖ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

బాన్సువాడ, బతుకమ్మ : జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్సువాడలో పోలీస్ శాఖ, మీడియా ప్రతినిధుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. బాన్సువాడ జూనియర్ కాలేజీ మైదానం ఈ సందర్భంగా సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం నుంచే రెండు జట్ల సభ్యులు మైదానానికి చేరుకుని ఆటను ఆనందంగా ఆరంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన పట్టణ సీఐ తుల శ్రీధర్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలీసులు, ప్రెస్ సమాజంలో కీలకంగా పనిచేస్తున్న రెండు వర్గాలు అన్నారు....