Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 5:02 pm Posted by : ramakrishna

పోలీస్ శాఖ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

బాన్సువాడ, బతుకమ్మ : జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్సువాడలో పోలీస్ శాఖ, మీడియా ప్రతినిధుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. బాన్సువాడ జూనియర్ కాలేజీ మైదానం ఈ సందర్భంగా సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం నుంచే రెండు జట్ల సభ్యులు మైదానానికి చేరుకుని ఆటను ఆనందంగా ఆరంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన పట్టణ సీఐ తుల శ్రీధర్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలీసులు, ప్రెస్ సమాజంలో కీలకంగా పనిచేస్తున్న రెండు వర్గాలు అన్నారు. ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడంలో పాత్రికేయుల సేవ అత్యంత విలువైనదన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు స్నేహాన్ని మరింత పెంపొందిస్తాయి అని అన్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మ్యాచ్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రతి ఓవర్, ప్రతీ బంతి పై ఉత్సాహం కనిపించింది. మీడియా జట్టులో ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు అందరూ సమానంగా భాగమయ్యారు. పోలీస్, ప్రెస్ సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే క్రీడా స్ఫూర్తితో కూడిన ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలి అని ఆయన సూచించారు. ఆట ముగిసిన అనంతరం రెండు జట్లూ పరస్పరం అభినందించుకుని, స్నేహం, సహకారానికి చిహ్నంగా ఈ మ్యాచ్ నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.