Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 7:04 pm Posted by : ramakrishna

జర్నలిస్టులకు నరేంద్ర స్మారక క్రికెట్ పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో జర్నలిస్ట్లకు క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను మహిళ ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ పోటీలలో భాగంగా ఆదివారం పంచరెడ్డి శ్రీకాంత్ ఎలెవన్ జట్టుపై సుభాష్ ఎలెవన్ జట్టు మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మేరే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొచ్చ రాజు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, ఎటాక్స్ కమిటి చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, మీసాల సుధాకర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లలు, కెమోరామెన్లు పాల్గొన్నారు.

 

Cricket competitions for journalists