క్రికెట్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
కామారెడ్డి, బతుకమ్మ : ఎంసీఏ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని సబ్డిపూర్ రోడ్ లో ఆదివారం సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ అకాడమీలో 8 నుండి 18 సంవత్సరాల బాల, బాలికలు ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్ కోచింగ్, ప్రాక్టీస్ కోసం 4 రకాల పిచ్ లను తయారు చేశారు. ఈ కార్యక్రమాన్నిటీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ క్రికెట్ ఆటగాళ్లు మాజి కెప్టెన్ బాలాజీ, మాజీ కెప్టెన్ దేవెంధర్,...