Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 7:07 pm Posted by : ramakrishna

క్రికెట్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ప్రారంభం

కామారెడ్డి, బతుకమ్మ : ఎంసీఏ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని సబ్డిపూర్ రోడ్ లో ఆదివారం సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ అకాడమీలో 8 నుండి 18 సంవత్సరాల బాల, బాలికలు ఉపయోగించుకోవడానికి  ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్ కోచింగ్, ప్రాక్టీస్ కోసం 4 రకాల పిచ్ లను తయారు చేశారు. ఈ కార్యక్రమాన్నిటీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ క్రికెట్ ఆటగాళ్లు మాజి కెప్టెన్ బాలాజీ, మాజీ కెప్టెన్ దేవెంధర్, నవీన్, టీఎన్జీఓస్ సెక్రటరీ నాగరాజు, టీఎన్జీఓస్ సహా అధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజు, టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి అధ్యక్షులు మహిపాల్, శ్రీనివాస్ రెడ్డీ, దీక్షిత్, రోహిత్, నవీన్, రాహుల్, మనోహర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

Cricket Academy Summer Camp begins